![]() |
![]() |

తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణం త్వరలోనే రాబోతుంది. బిగ్ బాస్ తెలుగు తెలివిజన్ రంగంలో సంచలనం సృష్టిస్తున్న రియాలిటి షో బిగ్ బాస్. విజయవంతంగా ఎనిమిది సీజన్లు పూర్తిచేసుకొని తొమ్మిదో సీజన్ కి సర్వం సన్నద్దమవుతుంది.
ఈసారి హోస్ట్ గా మళ్ళీ నాగార్జున నే వస్తున్నాడు అనడంలో ఎలాంటి మార్పు లేదు. ఎందుకంటే తాజాగా స్టార్ మాలో బిగ్ బాస్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసారు. ఈసారి బిగ్ బాస్ లోకి సెలబ్రిటీలే కాకుండా కామన్ మ్యాన్ కి కూడా ఎంట్రీ ఉంది. ఎవరు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారనేది అందరిలో ఉన్న డౌట్. తాజాగా వచ్చిన ప్రోమోలో అగ్నిపరీక్షలో ఆడి గెలిచిన వారికే బిగ్ బాస్ సీజన్-9 హౌస్ లోకి ఎంట్రీ ఉంటుందట.. ఆ అగ్నిపరీక్ష అనేది డైరెక్ట్ టెలివిజన్ కాకుండా జియో హాట్ స్టార్ లో టెలికాస్ట్ కాబోతుంది.
అన్ని సీజన్లలో కంటే బిగ్ బాస్ సీజన్ 8 భిన్నంగా ఉందనుకుంటే అంతకు మించి భిన్నంగా ఈ సీజన్ ఉండబోతుందనేది ప్రోమో చూస్తేనే తెలుస్తుంది. ఈసారి చదరంగం కాదు రణరంగమే అని నాగార్జున ప్రోమోలో చెప్పడంతో ప్రేక్షకులలో మరింత ఆసక్తి నెలకొంది. ప్రతి సీజన్ ఆగష్టు లేదా.. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో మొదలవుతుంది బిగ్ బాస్. అయితే ఈ సీజన్(Bigg Boss 9 Telugu) మాత్రం ఆగష్టు 23 న గ్రాంఢ్ గా లాంచ్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
![]() |
![]() |